An intense birthday poster of Vijay Deverakonda’s VD12, directed by Gowtam Tinnanuri, unveiled; wows fans and netizens
Vijay Deverakonda and director Gowtam Tinnanuri are teaming up for a period drama, directed by Gowtam Tinnanuri, where Sreeleela plays the female lead. Tentatively titled VD12, the film is jointly produced by S Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas. The drama is presented by Srikara Studios. One of the country’s top composers, Anirudh Ravichander scores the music. VD12 was formally launched last week.
Commemorating Vijay Deverakonda’s birthday today, VD12 makers have come up with a special surprise for fans even before the film went on floors. A new sepia-tinted retro poster of the untitled film was launched today. In the special birthday poster, various pieces of paper when brought together unveil a partial glimpse of the actor’s look. His look is introduced through a black-and-white portrait where his intense expressions grab eyeballs.
The quote of an anonymous spy - ‘I don’t know where I belong, to tell you whom I betrayed’ adds to the intrigue. “Happiest birthday to you Vijay. You deserve all the success and love in the world. Wishing Kushi to be a blockbuster and we continue the run,” the director wrote while sharing the poster.
With the intensity of Vijay Deverakonda and the storytelling abilities of Gowtam Tinnanuri, the director of Jersey and Malli Raava, one can expect a cracker of an outing on the big screen. One also can’t wait to watch Vijay Deverakonda and Sreeleela’s on-screen pairing.
Girish Gangadharan is the cinematographer while Navin Nooli(National Award winner for Jersey) is the editor. Avinash Kolla is the art director. The shoot of VD12 commences this June. Other details surrounding the film, cast will be announced shortly.
విజయ్ దేవరకొండ పుట్టినరోజు కానుకగా 'VD12' నుంచి ప్రత్యేక పోస్టర్
* 'VD12' కొత్త పోస్టర్ లో ఉట్టిపడుతున్న క్రియేటివిటీ
యువ సంచలనం విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మే 3న సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
నేడు(మే 9) విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఓ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ చాలా క్రియేటివ్ గా ఉంది. పియానోని తలపిస్తూ పేర్చిన కాగితపు ముక్కలపై కథానాయకుడి రూపం కనిపించడం ఆకట్టుకుంటోంది. కథానాయకుడి కళ్ళలో ఇంటెన్స్ కనిపిస్తోంది. అలాగే పోస్టర్ పై "I don't know where I belong, to tell you whom I betrayed - Anonymous Spy" అని రాసుంది. పోస్టర్ ను రూపొందించిన తీరు చూస్తుంటే సినిమా చాలా కొత్తగా ఉండబోతుందని అర్థమవుతోంది.
గతంలో గౌతమ్ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ 'జెర్సీ' చిత్రం కోసం జతకట్టారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్ళు రాబట్టి ఘన విజయం సాధించింది. 'జెర్సీ' సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. ఇప్పుడు ఈ ప్రతిభకు, అతి కొద్ది కాలంలోనే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విజయ దేవరకొండ తోడయ్యారు. అభిమానుల, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన చిత్రాన్ని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది.
ఈ చిత్రంలో విజయ్ సరసన నాయికగా శ్రీలీల నటిస్తున్నారు. తన అందం, అభినయం, నాట్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ యువ తార మొదటిసారి విజయ్ తో జోడీ కడుతుండటం విశేషం. ఇక 'జెర్సీ'లో తన సంగీతంతో కట్టిపడేసిన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. 'జెర్సీ'తో జాతీయ అవార్డును అందుకున్న నవీన్ నూలి ఎడిటర్ గా పని చేయనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా గిరీష్ గంగాధరన్, ఆర్ట్ డైరెక్టర్ గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు. ఇలా ఎందరో ప్రతిభావంతులు కలిసి పని చేస్తున్న ఈ సినిమా షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుంది.
తారాగణం: విజయ దేవరకొండ, శ్రీలీల
రచన, దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య
సంగీతం: అనిరుధ్ రవిచందర్
డీఓపీ: గిరీష్ గంగాధరన్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా