Ram Charan - Shankar combination film launched మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో స్టార్ ప్రొడ్యూస‌ర్స్ దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న పాన్ ఇండియా చిత్రం.. లాంఛనంగా ప్రారంభం

*Mega Power Star Ram Charan, Sensational Director Shankar come together with Star Producers Dil Raju, Sirish for Pan-India Movie*

*Movie launched in a grand manner today*

The massive pan-India project jointly produced by star producers Dil Raju and Sirish in the combination of Mega Power Star Ram Charan and Sensational Director Shankar was launched today amid fanfare. Megastar Chiranjeevi, pan-India director SS Rajamouli, and Bollywood star hero Ranveer Singh graced the occasion as chief guests. If the Muhurtham shot was given the clap by Megastar Chiranjeevi, Ranveer Singh switched on the camera. SS Rajamouli directed the first shot. The Megastar handed over the script to Shankar.

This one is Ram Charan's 15th movie. The prestigious project is the 50th movie for Sri Venkateswara Creations' Dil Raju and Sirish. The movie will be made in Telugu, Tamil, and Hindi with the full range of a pan-India movie. Bollywood beauty Kiara Advani is its heroine, while Srikanth, Jayaram, Naveen Chandra, Sunil and Anjali will be seen in crucial roles. Music sensation SS Thaman is the music director. Thirunavukarasu is its cinematographer. The rest of the cast and crew details will be announced soon.

Cast:

Ram Charan, Kiara Advani, Srikanth, Jayaram, Naveen Chandra, Sunil, Anjali and others.

Crew:

Writer, director: S Shankar

Producers: Dil Raju, Shirish (Sri Venkateswara Creations)

Co-Producer: Harshith Reddy

Line Producer: Narasimha Rao

Cinematographer: Thirunavukarasu

Music Director: SS Thaman

Production Designers: Ramakrishna, Monika

Writers: Sai Madhav Burra, Su.Venkatesan (Tamil), Vivek (Tamil)

Lyricists: Ramajogayya Sastry, Anantha Sriram, Vivek (Tamil)

PRO: Vamsi Kaka


మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో స్టార్ ప్రొడ్యూస‌ర్స్ దిల్‌రాజు, శిరీశ్ నిర్మిస్తోన్న భారీ పాన్ ఇండియా చిత్రం బుధ‌వారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా బాలీవుడ్ స్టార్ రణవీర్‌ సింగ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. మెగాస్టార్ చిరంజీవి స్క్రిప్ట్‌ను డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు అందించారు.

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న 15వ చిత్ర‌మిది. అలాగే శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీశ్ ప్రెస్టీజియ‌స్‌గా నిర్మిస్తున్న 50వ చిత్రం. తెలుగు, త‌మిళ‌,, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో మూవీ రూపొంద‌నుంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌, జ‌య‌రామ్‌, న‌వీన్ చంద్ర‌, సునీల్‌, అంజ‌లి ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి తిరుణ్ణావుక్క‌ర‌సు సినిమాటోగ్రాఫ‌ర్‌. సినిమాకు సంబంధించిన ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

న‌టీన‌టులు:

రామ్‌చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ, శ్రీకాంత్‌, జ‌య‌రామ్‌, న‌వీన్ చంద్ర‌, సునీల్‌, అంజ‌లి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.శంక‌ర్‌
నిర్మాత‌లు: దిల్‌రాజు, శిరీష్‌(శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్)
కో ప్రొడ్యూస‌ర్‌: హ‌ర్షిత్ రెడ్డి
లైన్ ప్రొడ్యూస‌ర్‌: న‌ర‌సింహారావు
సినిమాటోగ్రాఫ‌ర్‌: తిరుణ్ణావుక్క‌ర‌సు
మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్‌: రామ‌కృష్ణ‌, మోనిక‌
రైట‌ర్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా, సు.వెంక‌టేశ‌న్‌(త‌మిళ్‌), వివేక్‌(త‌మిళ్‌)
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి, అనంత శ్రీరామ్‌, వివేక్‌(త‌మిళ్‌)
పి.ఆర్‌.ఓ: వంశీ కాకా